‘ప్రస్థానం’ సినిమాతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో తెలుగు వారికి పరిచయమైన సందీప్ కిషన్ ఆ తర్వాత హిందీలో “షోర్ ఇన్ ది సిటీ” మరియు “స్నేహ గీతం” వంటి చిత్రాల్లో నటించారు.ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలు మల్టీ స్టారర్ చిత్రాలు ప్రస్తుతం చేస్తున్న ‘గుండెల్లో గోదారి’ కూడా మల్టీ స్టారర్ కాగా, సందీప్ సోలో హీరోగా చేస్తున్న మొదటి సినిమా ‘రొటీన్ లవ్ స్టొరీ’ అంతే కాకుండా మొట్ట మొదటి సారిగా కామెడి అంశాలున్నా కథను చెయ్యడంతో సందీప్ ఈ చిత్రం మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో సందీప్ మాట్లాడుతూ ‘ నేను సోలో హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఇదే, అలాగే నా కెరీర్లో నేను చేస్తున్న మొదటి కామెడీ మూవీ కూడా ఇదే. ఇప్పటి వరకూ నేను కామెడీ టచ్ ఉన్న సినిమాలు చేయలేదు. సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ సినిమాకి వచ్చిన వారందరూ బాగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నాడు. ఇద్దరు ప్రేమికులు లివింగ్ టుగెదర్ మొదలెట్టాక వారి మధ్య బంధం ఎలా మారింది అన్న అంశం మీద ఈ చిత్రం ఉండబోతుంది. రేజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.