ఢమరుకం నాకు సహనం గురించి నేర్పింది – నాగ్

ఈ రోజు అన్నపూర్ణ స్టుడియోలో ‘ఢమరుకం’ సినిమా విశేషాలు తెలియజేయడం కోసం ‘కింగ్’ అక్కినేని నాగార్జున ప్రత్యేక ప్రీస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్లో ‘ఢమరుకం’ సినిమాని నవంబర్ 23 న విడుదల చేయనున్నామని అనౌన్స్ చేసారు. అలాగే ఇన్ని రోజులు ‘ఢమరుకం’ సినిమా చుట్టూ ఉన్న చిక్కులన్నీ తొలగిపోయాయి అని, ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల నాలో సహనం మరియు నిగ్రహం అనే విషయాల గురించి మరింత నేర్పిందని అన్నారు.

‘ ‘ఢమరుకం’ సినిమా ఇప్పటి వరకూ చాలా బరువులు పడ్డాయి అవన్నీ నిన్నటితో తొలగిపోయాయి వీటి వల్ల సహనం మరియు నిగ్రహం అనే విషయాలను నేర్చుకున్నాను. ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన దాసరి నారాయణ రావు గారికి, అలంకార్ ప్రసాద్ గారికి, నా ఫాన్స్ కి మరియు మిగతా వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా 23న విడుదల కానుంది మరియు సినిమా విజయంపై నాకు పూర్తిగా నమ్మకం ఉందని’ నాగ్ అన్నారు.

అలాగే ఈ చిత్ర నిర్మాత ఆర్.ఆర్ వెంకట్ కృతఙ్ఞతలు తెలుపారు ‘ బిజినెస్ అన్న తర్వాత ఇబ్బందులు ఉంటాయి కానీ వెంకట్ గారు ఈ సినిమా విడుదల చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు ఇలాంటి ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ కి గట్స్ కావాలి ఈ విషయంలో ఆయనకీ నా కృతఙ్ఞతలు’ అని నాగ్ అన్నారు. ఈ ప్రెస్ మీట్లో ఈ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Exit mobile version