
నిఖిల్ మరియు స్వాతిలు ప్రధాన పాత్రలలో రానున్న క్రైమ్ కామెడి చిత్రం “స్వామి రా రా” చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. సుధీర్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. త్వరలో ఈ చిత్రం కేరళలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకోనుంది. డిసెంబర్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోనుంది. రవిబాబు కీలక పాత్ర పోషించనున్నారు. పూజ రామచంద్రన్ “లవ్ ఫెయిల్యూర్” చిత్రం తరువాత ఈ చిత్రంలో కనిపించనుంది. సన్నీ సంగీతం అందిస్తున్న రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది.