వరుణ్ సందేశ్, సంచిత పదుకొనే మరియు కేథరిన్ తెరెసా ప్రధాన పాత్రలలో రానున్న “చమ్మక్ చల్లో” చిత్రం ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటుంది. గతంలో “విరోధి”, “షో”,”మిస్సమ్మ” వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన నీలకంఠ మొట్టమొదటి సారిగా రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. సంచిత మరియు కేథరిన్ గతంలో మలయాళంలో నటించారు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ మధ్యనే విడుదల అయ్యింది ఈ ఆల్బంలో వరుణ్ సందేశ్ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తండ్రి పాత్రలో బ్రహ్మాజీ కనిపించనున్నారు. కిరణ్ వారణాసి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డి ఎస్ రావు నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది.