సిద్దార్థ్,సమంత ప్రధాన పాత్రలలో రానున్న చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చెయ్యనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. డిసెంబర్ చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కాని ప్రస్తుతం విడుదల తేదీని జనవరి మొదట్లోకి మార్చారు ఈ మార్పునకు గల అధికారిక కారణాలు తెలియలేదు. నిత్య మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిననున్నారు. ఇదే కాకుండా సిద్దార్థ్ నటించిన మరో రెండు చిత్రాలు 2013 మొదట్లో విడుదల కానున్నాయి. చూస్తుంటే 2013 సంవత్సరం సిద్దార్థ్ కి అద్భుతమయిన ఆరంభాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.