‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’ మరియు ‘అశోక్’ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితురాలైన సమీర రెడ్డి గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. సమీరా రెడ్డి చివరిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర గులాబీలు’ సినిమాలో కనిపించారు మరియు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. చాలా గ్యాప్ తర్వాత సమీర రెడ్డి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ద్వారా మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుంది. మొదట ఈ పాట చేయడానికి సమీర రెడ్డి సముఖత తెలపలేదు, క్రిష్ చెప్పిన కథ విని రానా ఒప్పించడంతో ఆమె ఒప్పుకున్నారు. ఈ పాటలో సమీర వెంకటేష్ గారితో కలిసి స్టెప్పు లేసింది. ఇటీవల తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ తెలుగులో మరిన్ని సినిమాలు ఒప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను మరియు తెలుగులో గ్లామరస్ పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని’ ఆమె అన్నారు. రానా – నయనతార జంటగా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలై తెలుగులో సమీరా రెడ్డికి లక్
తీసుకోస్తుందేమో చూడాలి.