కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి డబ్బింగ్ చెప్తున్న అలీ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో ఖచ్చితంగా ఉండే నటుడు కామెడి స్టార్ అలీ. పవర్ స్టార్ రాబోతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో కూడా ఈయన విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి అలీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు అన్న సంకేతాలను ఈ ట్రైలర్ అందించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది.

Exit mobile version