శశి పాత్రతో ప్రపంచంలోని ప్రతి తల్లికి సంబంధం ఉంటుందట


ఇండియన్ ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి దాదాపు 15 సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చి చేసిన చిత్రం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. శ్రీ దేవి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏ విషయం వల్ల ఈ చిత్రం క్లిక్ అవుతుందని అనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ చాలా సింపుల్ కథాంశంతో తీసిన చిత్రం ఇది, అలాగే ఈ చిత్రంలో యూనివర్సల్ గా ఉండే ఒక సమస్యని చూపించాము. ఈ చిత్రంలో బావోద్వేగాలతో పాటు, దృడమైన మనస్తత్వం కలిగిన శశి అనే పాత్ర చేసాను. ప్రపంచలోని అందరి మాతృమూర్తులకు సంబంధం ఉండేలా శశి పాత్ర ఉంటుంది. ఆవిషయం అందరికీ నచ్చుతుందని’ ఆమె అన్నారు. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ ఒక ముఖ్య భూమికను పోషించారు. ఈ చిత్ర హిందీ వెర్షన్లో అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో కనిపించనుండగా, తెలుగు మరియు తమిళ వెర్షన్లలో అజిత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version