అల్లరి నరేష్ తో కెవ్వు కేక పెట్టనున్న కన్నడ భామ


కన్నడ భామ షర్మిల మాండ్రే తెలుగులో ఆరంగేట్రం చెయ్యడానికి సిద్దమయ్యింది. అల్లరి నరేష్ రాబోతున్న చిత్రం “కెవ్వు కేక” చిత్రంతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ నెలలో మొదలు కానున్న ఈ చిత్ర చిత్రీకరణలో షర్మిల మాండ్రే నవంబర్ నుండి పాల్గొంటుంది. గతంలో ఈ నటి “సజ్ని”,కృష్ణ” మరియు “నవగ్రహ” వంటి కన్నడ చిత్రాలలో కనిపించింది. ఈ మధ్యనే తమిళంలో “మిరట్టల్” అనే చిత్రంలో కనిపించి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు తెలుగు తెర వంతు వచ్చింది ఇక్కడ కూడా తన అందాలతో యువతను, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ భామ అల్లరినరేష్ చిత్రంతో ఇటుగా వచ్చేయనుంది. గతంలో అల్లరి నరేష్ తో “బ్లేడ్ బాబ్జి” చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దేవి ప్రసాద్ మరోసారి జనాన్ని థియేటర్లలో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి “కెవ్వు కేక” తో సిద్దమయ్యారు బోపన్న చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాజ్,భీమస్ మరియు చిన్ని రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రంగా ఉండబోతుంది. అనిల్ సుంకర దర్శకత్వంలో రానున్న 3డి చిత్రం “యాక్షన్ 3డి” చిత్రీకరణలో ప్రస్తుతం అల్లా నరేష్ బిజీగా ఉన్నారు.

Exit mobile version