త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న అల్లరి నరేష్ “కెవ్వు కేక”


అల్లరి నరేష్ రాబోతున్న చిత్రం “కెవ్వు కేక” తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 3న చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. “బ్లేడ్ బాబ్జి” చిత్రం విజయం తరువాత అల్లరి నరేష్ తిరిగి దేవి ప్రసాద్ తో జత కడుతున్నారు. బోపన్న చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంతో కొత్త కథానాయిక పరిచయం కానుంది.రాజ్, భీమస్ మరియు చిన్ని రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లరి నరేష్ అనిల్ సుంకర దర్శకత్వంలో “యాక్షన్ 3డి” చిత్రంలోనూ మరియు ఇ సత్తిబాబు దర్శకత్వంలో “యముడికి మొగుడు” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు దసరాకి విడుదల కావచ్చని అంచనా. “సుడిగాడు” చిత్ర విజయం తరువాత అల్లరి నరేష్ మార్కెట్ భారీగా పెరిగింది. అయన పారితోషకం కూడా పెంచినట్టు సమాచారం. ఎదయితేనేమి ప్రస్తుతం పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు అయ్యాడు.

Exit mobile version