సిద్ధార్త్ సినిమాల్లో కంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఎక్కువ గడుపుతూ ట్విట్టర్లో రికార్డు కొట్టాడు. ట్విట్టర్లో అయన ట్వీట్స్ నచ్చడం వలనో ఫ్యాన్స్ తో బాగా కనెక్ట్ అవడం వలనో కాని ఆయనకి ఏకంగా 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ ఇండియన్ నటుల్లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ కేవలం సిద్ధార్థ్ కి మాత్రమే ఉండటం విశేషం. ఈ విషయాన్ని అయన తన ట్విట్టర్ ఎకౌంటులో ఆనందాన్ని పంచుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఇటాకి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లవ్ ఫెయిల్యూర్ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో తన బ్యానర్ పై మరో సినిమా నిర్మించనున్నట్లు సమాచారం. రామ్ సుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. సిద్ధార్త్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రారంభం అవుతుంది. సిద్ధార్థ్ సరసన హీరొయిన్ ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది.