అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి,శ్యాం ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “యాక్షన్” ప్రధాన భాగ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్ర తరువాత షెడ్యూల్ సెప్టెంబర్ 24 నుండి గోవాలో జరుపుకోనుంది. అనిల్ సుంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రై.లి. మీద నిర్మిస్తున్నారు. రాజు సుందరం, స్నేహ ఉల్లాల్, కామ్నా జేత్మలాని, నీలం , సుదీప్ ఈ చిత్రంలో ముఖ్యమయిన పాత్రలలో కనిపించనున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో ఇది తొలి 3డి చిత్రం, ఈ చిత్రం కోసం అనిల్ సుంకర చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి బప్పా లహరి సంగీతం అందించగా సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒకానొక రొమాంటిక్ పాటను రాఘవేంద్ర రావుకి అంకితం ఇవ్వాలని అనిల్ సుంకర నిర్ణయించుకున్నారు.