యాక్షన్ సన్నివేశాల్లో గాయపడ్డ బిందు మాధవి


తెలుగులో అవకాయ్ బిర్యాని సినిమాతో పరిచయమై ఆ తరువాత ఒకటి రెండు సినిమాలు చేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన బిందు మాధవి తమిళంలో బాగానే సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల ‘సట్టం ఒరు ఇరుట్టరై’ అనే ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం హాంగ్ కాంగ్ వెళ్ళింది. ఆమెతో పాటుగా పియా బాజ్పాయ్, తమన్ కుమార్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా ఈ సినిమాకి సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు అక్కడ చిత్రీకరించాలని ప్లాన్ చేసారు. హెలికాప్టర్ తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగి బిందు మాధవి, పియా బాజ్పాయ్ ఇద్దరికీ గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పి ఇద్దరూ గాయాలతో బైట పడ్డారు

Exit mobile version