సెన్సార్ నుండి యు సర్టిఫికేట్ అందుకున్న “శివ తాండవం”


విక్రం,అనుష్కలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం “శివతాండవం”. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు ఎటువంటి కట్స్ లేకుండా “యు” సర్టిఫికేట్ ఇచ్చారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ని సి కళ్యాణ్ తేజ సినిమా బ్యానర్ మీద నిర్మించారు. ఈ చిత్రంలో జగపతి బాబు పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా ఏమి జాక్సన్, లక్ష్మి రాయిలు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విక్రం ద్విపాత్రాభినయం చెయ్యనున్నారు. అందులో ఒకటి సేక్రేట్ ఏజెంట్ పాత్ర కాగా మరికటి అంధుడి పాత్ర. గతంలో ఏ ఎల్ విజయ్ “నాన్న” మరియు” 1947 లవ్ స్టొరీ” వంటి చిత్రాలు మన రాష్ట్రంలో మంచి పేరుని సంపాదించుకున్నా. ఈ చిత్ర ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోనగా ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందించారు నిరావ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. వచ్చే వారాంతంలో ప్రభాస్ “రెబల్” చిత్రంతో ఈ చిత్రం పోటిపడనుంది. ఈ చిత్రం “రెబల్” ధాటిని తట్టుకోగలద అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏమవుతుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version