‘కృష్ణా ముకుందా మురారి’ అనబోతున్న మహేష్ బాబు


దూకుడు, బిజినెస్ మేన్ వంటి భారీ విజయాలతో ఊపు మీదున్న మహేష్ బాబు అదే ఊపులో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు.ఇదే జోరులో మరో సినిమా కూడా అంగీకరించాడు. బృందావనం సినిమాతో కూల్ హిట్ అందించిన వంశి పైడిపల్లితో మహేష్ సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. వంశి చెప్పిన స్క్రిప్ట్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, ఈ సినిమాకి కృష్ణా ముకుందా మురారి అనే కూడా ఖరారైనట్లు సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సుకుమార్ సినిమాలతో, వంశి పైడిపల్లి రామ్ చరణ్ తో ఎవడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Exit mobile version