రెండు నెలల క్రితం చేతినిండుగా తెలుగు మరియు మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రద్ధ దాస్ ప్రస్తుత్తం దక్షిణాది చిత్రాల నుండి కొంత విరామం తీసుకున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా బాలివుడ్లో ఒక చిత్రం చిత్రీకరణలో పాల్గొంటుంది. ఆమె బాలీవుడ్లో పెద్ద నిర్మాణ సంస్తకోసం మూడు చిత్రాలను ఒప్పుకున్నట్టు గతంలో ప్రకటించాము అందులో ఒక చిత్రమే ఇది. “కొద్దిరోజులుగా హైదరాబాద్ కి దూరంగా ఉన్నాను ప్రస్తుతం చండీగడ్ లో ఉన్నాను చిత్రీకరణ కోసం మరో 20 రోజులు ఇక్కడే ఉండబోతున్నాను” అని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గతంలో ఈ నటి మధుర భండార్కర్ “దిల్ తో బచ్చా హై జీ” చిత్రంలో ఒక పాత్ర పోషించింది ఇదే కాకుండా “లాహోర్” అనే చిత్రంలో కూడా నటించింది. త్వరలో ఈ భామ తెలుగులో వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో “రేయ్” చిత్రంలో నటిస్తున్నారు. సాయి ధరం తేజ్ ,సైయామి ఖేర్ మరియు శ్రద్ద దాస్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా వినయన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న “డ్రాకులా 3డి” చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.