యథాస్థితికి చేరిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర విడుదల తేది?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్ర విడుదల తేది తిరిగి మొదట్లో ప్రకటించిన విధంగానే అక్టోబర్ 11 కాకుండా అక్టోబర్ 18న విడుదల కానునట్టు పరిశ్రమలో బలమయిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. మొదట్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చెయ్యాలనే అనుకున్నారు కాని చిత్రీకరణ శరవేగంతో జరగడంతో దర్శకుడు పూరి విడుదల తేదీని ఒక వారం ముందుకి అక్టోబర్ 11కి తీసుకొచ్చారు. కాని ప్రస్తుతం ఈ చిత్రం మొదట్లో ప్రకటించిన విధంగానే అక్టోబర్ 18న విడుదల కానుందని సమాచారం. తమన్నా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాతలు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చెయ్యగానే మీ ముందుకి తీసుకొస్తాం.

Exit mobile version