మంచు విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం “దేనికయినా రెడీ” భారీ విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కథానాయికగా హన్సిక నటిస్తుంది. ఈ చిత్రాన్ని విష్ణు తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరి మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ నెలలో విడుదల చెయ్యనున్నారు చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చెయ్యాలని ఆలోచనలో ఉన్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.