చివరి పాట కోసం సిద్ధమవుతున్న పవర్ స్టార్


గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించిన తరువాత రెట్టించిన ఉత్సాహం మీద ఉన్న పవన్ కళ్యాణ్ అదే ఊపులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇటీవలే పవన్, తమన్నాల మీద పద్మాలయ స్టూడియోలో ఒక పాట చిత్రీకరణ చేయగా నిన్నటితో ఆ పాట చిత్రీకరణ పూర్తయింది. ఈ రోజు విశ్రాంతి తీసుకుంటున్న పవన్ రేపటి నుండి మళ్లీ షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాట చిత్రీకరించనున్నారు. ఈ పాటతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుపుకుంటుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 24న అభిమానుల మధ్య భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలకి సిద్ధమవుతుంది.

Exit mobile version