సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కడలి’. తెలుగులో కూడా విడుదలవుతున్న ఈ చిత్రానికి ‘కడలి’ అనే టైటిల్ ని ఖరారు చేసారని సమాచారం. ‘అభినందన’ సినిమాలో హీరోగా నటించిన కార్తీక్ తనయుడు గౌతమ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాధ చిన్న కూతురు తులసి కథానాయికగా పరిచయమవుతోంది. మొదట ఈ చిత్రంలో కథానాయికగా సమంతని తీసుకున్నారు కానీ ఆమె అనారోగ్యం కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రేమ కథా చిత్రాన్ని ఎక్కువ భాగం కేరళలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. అర్జున్, అరవింద్ స్వామి మరియు లక్ష్మీ మంచు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మణిరత్నం తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగు వర్షన్ కి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.