దేవకట్ట డైరెక్షన్లో 2005లో వచ్చిన వెన్నెల చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. వెన్నెల సినిమాతో పరిచయమై టాప్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుండి ఎ సర్టిఫికేట్ అందుకుంది. చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగా మోనాల్ గజ్జర్ హీరొయిన్ గా నటించింది. వెన్నెల సినిమాకి సీక్వెల్ వస్తుంది తెలిసినప్పటి నుండి యువత ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే రీషూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల చాలా ఆలస్యంగా విడుదల అవుతుంది. ఈ నెల 21న విడుదల అవుతున్న నాలుగు సినిమాలలో ఇది ఒకటి కాగా ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. భరత్ కామెడీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని యూనిట్ సభ్యుల సమాచారం.