చివరి దశకు చేరుకున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగ్


విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే పెళ్ళికి సంబందించిన కొన్ని సన్నివేశాలు చెన్నై లోని శ్రీ పెరంబూరులో షూటింగ్ జరగగా యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. కొన్ని మిగిలిన టాకీ పార్ట్ పూర్తి చేసి పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోని నవంబర్లో విడుదల చేసి సినిమాని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తన మొదటి సినిమా కొత్త బంగారు లోకంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Exit mobile version