సిద్దార్థ్- సమంతల చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న తాగుబోతు రమేష్


ఈ మధ్య కాలంలో తాగుబోతు పాత్రలతో బాగా ప్రచారం పొందిన వ్యక్తి తాగుబోతు రమేష్. ఎస్ ఎస్ రాజమౌళి చిత్రం “ఈగ”లో అయన పాత్ర మంచి పేరు సంపాదించుకుంది. ఆయన త్వరలో సిద్దార్థ్ మరియు సమంతలు ప్రధాన పాత్రలలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది త్వరలో ఒక పాటను మరియు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి దుబాయ్ పయనమవనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. హాస్య సన్నివేశాల విషయంలో నందిని రెడ్డి సిద్ద హస్తురాలనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ చిత్రంలో తాగుబోతు రమేష్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేయ్యబోతున్నాడని తెలుస్తుంది.

Exit mobile version