బాలీవుడ్లో రిమేక్ అవుతున్న అల్లరోడి సినిమా


కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు దగ్గర కనక వర్షం కురిపించింది. హిట్ సినిమాలోని సన్నివేశాలను పేరడీగా చేసి తీసిన ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ‘తమిళ్ పడం’ అనే తమిళ సినిమాకి రిమేక్ గా తెరకెక్కిన ‘సుడిగాడు’ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో రిమేక్ చేస్తున్నారు. బాలీవుడ్లో కామెడీ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న రితేష్ దేశ్ ముఖ్ ఈ చిత్ర రిమేక్ లో నటించనున్నాడు. ఈ చిత్రానికి ‘ఫిల్మీ పిక్చర్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర హిందీ వర్షన్స్ కి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులను మరియు ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

Exit mobile version