వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమైంది ఈ వేళ’ సినిమా కుర్రకారుకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా పెద్దలను ఆకట్టుకోకపోయినా అబ్బాయిలకు మాత్రం బాగా నచ్చింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుంది. శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భాను శంకర్ అనే నూతన దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.