పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలోని ఒక పాటని ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. రెండు పాటల మినహా ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తయ్యింది. మరి కొద్ది రోజుల్లో పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది.
మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది అలాగే అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బద్రి’ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత పవన్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఒక టీవీ రిపోర్టర్ పాత్రని పవన్ పోషించారు.