బెంగాలిలో ఊసరవెల్లి


ఎన్టీఆర్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “ఊసరవెల్లి” 2011లో విడుదలయిన ఈ చిత్రం త్వరలో బెంగాలిలో రీమేక్ చెయ్యనున్నారు. తాజా సమాచారం ప్రకారం మిథున్ చక్రవర్తి కొడుకు మిమో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి “రాకీ” అనే పేరు పెట్టారు. పూజ ఈ చిత్రంలో నటిస్తుంది. సుజిత్ మొండాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న హైదరాబాద్లో మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించకపోయినా బెంగాలి నిర్మాతలను ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ “బాద్షా” చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బండ్ల నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు శ్రీను వైట్ల ఇద్దరు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి చాలా కృషి చేస్తున్నారు

Exit mobile version