ఏ.ఆర్ రెహమాన్ పేరు తెలియని సంగీతాభిమాని ఉండడేమో. రోజా సినిమాతో మొదలైన అయన ప్రస్థానం హాలీవుడ్ వరకు సాగింది. ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన ఆయనకు త్వరలో అరుదైన సత్కారం జరగనుంది. సంగీత ప్రస్థానం మొదలు పెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయనను అక్టోబర్ 21న చెన్నైలో ఒక ప్రోగ్రాంతో సత్కరించనున్నారు.”ఇసై పుయల్, ది మాన్ – ది మ్యూజిక్ – ది మేజిక్” పేరుతో జరగనున్న ఈ వేడుకను రెహమాన్ సోదరి రెహన ‘రెయిన్ డ్రాప్స్’ బ్రాండ్ అధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు.