ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘చారులత’ సినిమా శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో పాటు విడుదలవడం లేదు. ఈ హార్రర్ సినిమాని మొదట సెప్టెంబర్ 14న విడుదల చేయాలనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రియమణి అవిభక్త కవలుగా నటిస్తున్న ‘చారులత’ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోన్ కుమరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ మూర్తి నిర్మించారు. కన్నడ మరియు తమిళ బాషలలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. మూడు బాశాల్లోను ఈ చిత్రాన్ని ఒకే సారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రియమణి సరసన స్కంద ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో ప్రియమణి చేసిన పాత్ర ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని మరియు సినిమా విజయం సాదిస్తుందని ఈ చిత్ర నిర్మాత రమేష్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. సుందర్ సి బాబు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.