టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ హీరో సుదీప్. ‘ఈగ’ చిత్రంతో సుదీప్ కి ఆంధ్రప్రదేశ్ లో మంచి పేరు రావడంతో ప్రస్తుతం మన టాలీవుడ్ చోటా నిర్మాతలు కన్నడలో విజయం సాదించిన ఆయన సినిమాలను ప్రస్తుతం తెలుగులోకి అనువదిస్తున్నారు. అందులో భాగంగానే సుదీప్ నటించిన ‘కిచ్చా హుచ్చా’ చిత్రాన్ని ‘కిచ్చా’ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని మాతా మీడియా పతాకం పై అరిగెల కిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్లకు పైగా విడుదల చేయనుండడం విశేషం. రమ్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గురుదత్ దర్శకత్వం వహించగా, వి. హరికృష్ణ సంగీతం అందించారు.