యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బ్యాంకాక్‌లో ‘బాద్షా’ చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగష్టు మధ్య నుండి ఇప్పటి వరకూ బాంకాక్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ షెడ్యూల్లో రెండు యాక్షన్ సన్నివేశాలను, ఒక పాటని మరియు కొంత టాకీ పార్ట్ ని చిత్రీకరించారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ మరియు కెల్లీ దోర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డాషింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల తో పాటు గోపి మోహన్ మరియు కోన వెంకట్ కథని అందించారు.
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లబించింది. ఈ పోస్టర్స్ ను చూసి సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఎన్.టి.ఆర్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోవాలని బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మరియు ఎంతో స్టైలిష్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చెయ్యాలని శ్రీను వైట్ల కూడా చాలా కష్ట పడుతున్నారు. ఈ చిత్రాన్ని 2013 జనవరి 11న విడుదల చేయాలనుకుంటున్నారు.