నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న డమరుకం ఆడియో ఈ నెల సెప్టెంబర్ 10న అక్కినేని అభిమానుల మధ్య ఘనంగా విడుదల కానుండగా సినిమాని మొదటగా అక్టోబర్ 12న విడుదల చేయాలనీ భావించారు. అయితే పలు కారణాల వల్ల సినిమా విడుదలని అక్టోబర్ 12 నుండి 19 వాయిదా వేసారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అక్టోబర్ 11న విదుదలవుతుండటంతో రెండు సినిమాల మధ్య పోటీ లేకుండా డమరుకం సినిమాని ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా నాగార్జున సరసన అనుష్క నటించింది. ఆర్. ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు