సెన్సార్ పూర్తి చేసుకున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్


శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి చేసుకోగా ఈ చిత్రానికి గాను సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికేట్ అందజేసారు. సన్షైన్ వ్యాలీ అనే కాలనీలో ఉండే వారి మధ్య సంబందాలు అందంగా చూపిస్తూ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మా సినిమాలో చూపిస్తాం అంటున్నారు శేఖర్ కమ్ముల. అక్కినేని అమల దాదాపు 20 ఏళ్ళ తరువాత నటిస్తుండటం వల్ల ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రియ, అంజలా జవేరితో పాటుగా నూతన నటీ నటులను పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందాయి.

Exit mobile version