తమిళ స్టార్ అజిత్ రాబోతున్న చిత్రం కోసం చిత్రీకరణలో ఎట్టకేలకు తాప్సీ పాల్గొంటున్నారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార మరియు ఆర్యలు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ విలేఖరి పాత్రలో కనిపించనుంది. తమిళంలో ఇప్పటిదాకా చేసిన చిత్రాలలో తాప్సీ చేస్తున్న అతి పెద్ద చిత్రం ఇది. ” ఎట్టకేలకు వస్త్రదారణ ట్రైల్స్ అన్ని అయిపోయాయి ఈ ఏడాది అత్యంత వేచి చూస్తున్న చిత్రం మొదలు కానుంది విష్ణు గారికి నా లుక్ నచ్చింది. అజిత్,నయన తార ఇంకా ఆర్య కూడా రేపు చిత్రీకరణలో పాల్గొననున్నారు” అని తాప్సీ నిన్న ట్వీట్ చేశారు. ఈరోజు చిత్రీకరణలో పాల్గొన్న ఈ నటి ” ఈరోజు నా 14వ చిత్రం మొదలయ్యింది మొదటి చిత్రం చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నాను ఎటువంటి మార్పు లేదు” అని అన్నారు. తెలుగులో ఈ నటి నటించిన “గుండెల్లో గోదారి” చిత్రం త్వరలో విడుదల కానుంది. త్వరలో వెంకటేష్ “షాడో” చిత్రీకరణలో మరియు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ చిత్రం చిత్రీకరణలోను పాల్గొననున్నారు.