మెగాస్టార్ రీమిక్స్ పాటలో అల్లరోడు


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా, రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘యముడికి మొగుడు’. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఒక పాట రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక భారీ ఆడిటోరియం సెట్లో చిత్రీకరిస్తున్నారు. నిన్న ప్రారంభమైన ఈ పాట చిత్రీకరణ ఈ నెల 13 వరకు జరుగనుంది. ఈ పాటలో నరేష్ ఇప్పటి వరకూ కనిపించని ఒక కొత్త గెటప్ లో కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాత అడ్డాల చంటి మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ఒక పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నాం, దీని తర్వాత విదేశాల్లో చిత్రీకరంచే ఒక పాటతో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మెగాస్టార్ నటించిన అల్లుడా మజాకా చిత్రంలోని ‘అత్తో అత్తమ్మ కూతురో’ పాటను రీమిక్స్ చేసి, రమ్యకృష్ణ – నరేష్ – రిచా పనాయ్ ల మీద చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ‘ ఆయన అన్నారు. సాయాజీ షిండే యముడిగా కనిపించనున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version