ఈ మధ్య కాలంలో అమల పాల్ మేఘాల్లో తేలిపోతుంది. ఈ మధ్యనే మలయాళంలో తిరిగి తెరంగేట్రం చేసిన చిత్రం “రన్ బేబి రన్” అక్కడ భారీ విజయం సాదించింది. ఈ చిత్రంలో బ్రేకింగ్ న్యూస్ కోసం ఏమయినా చేసే ఒక ఎడిటర్ పాత్రలో అమలా పాల్ నటించింది. చాలా కాలం తరువాత అమలా పాల్ మలయాళంలో ఒక కమర్షియల్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా మోహన్ లాల్ నటించారు ఓనంకి విడుదలయిన అన్ని చిత్రాలలో “రన్ బేబి రన్” చిత్రం విజేతగా నిలిచింది. తెలుగులో ఆమె చేస్తున్న చిత్రాలు “నాయక్” మరియు “జెండా పై కపిరాజు” చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ మధ్యనే ఐస్ ల్యాండ్ లో “నాయక్” చిత్రం కోసం చరణ్ సరసన ” శుభలేఖ రాసుకున్నా” పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అక్కడ నుండి నేరుగా “జెండా పై కపిరాజు” తమిళ వెర్షన్ చిత్రీకరణ కోసం గోవా వెళ్ళారు. తన కెరీర్ గాడిలో పడటంతో తన ఆనందానికి ఇంతకన్నా కారణాలు అవసరం లేకుండాపోయింది. నాయక్ చిత్రంతో పరిశ్రమలో పెద్ద దర్శకులు మరియు నిర్మాతలను ఆకట్టుకోనుంది. “నాయక్” చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.