పవన్ సినిమా డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పూరి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని శబ్దాలయ స్టుడియోలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్న డబ్బింగ్ కోసం పూరి జగన్నాధ్ దగ్గరుండి మరీ ఈ భాధ్యతలు అన్నీ చూసుకుంటున్నాడు. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసిన పూరి జగన్నాధ్ అనుకున్న సమయాని కంటే ఒక వారం ముందే అక్టోబర్ 11 న విడుదల చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోలో పవన్ స్టైల్ చుసిన అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో మరో హిట్ గ్యారంటీ అని అంచనాలు వేసుకుంటున్నారు. మణిశర్మ స్వరపరిచిన పాటలు ఈ నెల 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్నా హీరొయిన్ గా నటించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version