విడుదలకు సిద్దమైన ‘డేవిడ్ బిల్లా’


సూపర్ హిట్ మూవీ ‘బిల్లా’ చిత్రానికి ఫ్రీక్వెల్ గా తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం “డేవిడ్ బిల్లా”. కమల్ హాసన్ మరియు వెంకటేష్ లతో “ఈనాడు” లాంటి చిత్రాన్ని తీసిన చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఈ చిత్ర నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ” ‘డేవిడ్ బిల్లా’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశాన్ని కూడా కట్ చెయ్యలేదని, ఒకే ఒక డైలాగ్ ని మాత్రమే మ్యూట్ చేశారన్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1200 ప్రింట్లతో తెలుగు మరియు తమిళ భాషల్లో జూలై 13న విడుదల చేయనున్నాం. ఈ చిత్రం చివరి పాటలో యువన్ శంకర్ రాజా తెరపై కనిపించనుండడం చెప్పుకోదగ్గ విశేషం” అని ఆమె అన్నారు. ఈ చిత్రంలో పార్వతి ఒమనకుట్టన్ మరియు బ్రూన అబ్దుల్లాలు కథానాయికలుగా నటించారు. అజిత్ చాలా స్టైలిష్ లుక్ తో కనిపించనున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Exit mobile version