ముంబైకి మకాం మార్చనున్న ప్రభుదేవా


ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న దర్శకుడు మరెవరో కాదు మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా. ఈ మధ్య బాలీవుడ్లో వరుస హిట్లు అందించడంతో టాప్ నిర్మాతలు తమకు ఒక సినిమా చేసిపెట్టమని క్యూ కడుతున్నారు. ప్రభుదేవా చేయబోయే తదుపరి చిత్రం ఖరారైంది, ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ప్రభుదేవా హోంటౌన్ చెన్నై, తను హిందీ సినిమాల చిత్రీకరణ కోసం ఎక్కువగా చెన్నై నుండి ముంభైకి వెళ్లి రావడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభుదేవా తన నివాసాన్ని ముంబైకి మార్చుకోనున్నాడు.

ఈ విషయం గురించి ప్రభుదేవా మాట్లాడుతూ ” తన నివాసాన్ని ముంబైకి మార్చుతున్నానని, బోనీ కపూర్ వాళ్ళు కొత్త ఇంటికి మారి పోవడంతో, గ్రీన్ ఎకర్స్ ప్రాంతంలోని వారి పాత ఇంట్లో ఇకనుంచి తను ఉండబోతున్నారని ఆయన తెలిపారు”. తెలుగులో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమాని ‘రౌడీ రాథోర్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర 100కోట్లు సంపాదించిన చిత్రాల్లో ఒకటిగా చేరిపోయింది.

Exit mobile version