రానా,నయనతారలు కలిసి నటిస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” త్వరలో కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకోనుంది. గత నెల ఈ చిత్రంలో ప్రధాన బాగా యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కేరళలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ఆరు పోరాట సన్నివేశాలున్నాయి రానా ఈ చిత్రంలో సరికొత్త యాక్షన్ అవతార్ లో కనిపించనున్నారు.ఈ చిత్రంలో బి.టెక్ బాబు పాత్రలో రానా డాకుమెంటరీ తీసుకునే దేవిక (నయనతార) పాత్రతో ప్రేమలో పడతారు.ఈ చిత్రం వాళ్ళు ఎలా కలిశారు చివరికి ఏం సాధించారు అనే విషయం చుట్టూ తిరుగుతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా వై రాజీవ్ రెడ్డి , సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.