సమంత అభిమానులు ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. గత నెలగా ఆమె ఇబ్బంది పడుతున్న అనారోగ్యం నుండి బయటపడింది. “ఈగ” చిత్ర విడుదల సందర్భంగా సమంత ఈ విషయాన్నీ ట్విట్టర్లో తెలిపింది. ” నేను రాకపోవటం గురించి చాలా మాట్లాడుతున్నట్టు ఉన్నారు కాని నా అనారోగ్య కారణంగా పాల్గోనలేకపోతున్నాను ఇప్పుడు బాగానే ఉన్న త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటాను” అని ట్విట్టర్లో చెప్పారు. ఈ నటి నందిని రెడ్డి రాబోతున్న చిత్రం చిత్రీకరణలో పాల్గొననుంది. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం కొన్ని పాటలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” చిత్రంలో నటనకు గాను సమంత మంచి ప్రశంశలు అందుకుంటుంది. ఈరోజు వచ్చిన టాక్ ఇలానే కొనసాగితే ఈగ చిత్రం భారీ విజయం సాదించనుంది అనే చెప్పాలి.