ఈగ చిత్రం కోసం ప్రత్యేక రోబో


ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” తెలుగు చిత్ర స్థాయిని పెంచుతూ సాంకేతిక విషయాల్లో కొత్త పుంతలు తోక్కిస్తూ జూలై 6న విడుదల అవ్వడానికి సకలం సిద్దమయ్యింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రగా “ఈగ” కనిపించబోతుంది ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక రోబోని చేయించారు. చిత్రంలో సన్నివేశాలను ఈ రోబో ఉపయోగించి చిత్రీకరించారు నిర్మాణాంతర కార్యక్రమాలలో ఈ రోబో నిజమయిన ఈగలా కనపడేలా చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడు వాడని కెమెరా మరియు క్రేన్లను ఈ చిత్రం కోసం రాజమౌళి ఉపయోగించారు. ఈ సాంకేతిక విషయాలన్నీ 2.5 కోట్లతో చెయ్యాలనుకున్న చిత్రాన్ని 30 కోట్ల వరకు తీసుకెళ్ళింది.

Exit mobile version