బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రియా ఆనంద్


ప్రస్తుతం టాలీవుడ్ కథానాయికలు ఒక్కొక్కరుగా బాలీవుడ్లో అవకాశం దక్కించుకుంటున్నారు. టాలీవుడ్ చిత్రాలను హిందీలో రిమేక్ చేసి విజయాలు సాధిస్తున్న నిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ కథానాయికలను కూడా హిందీ తెరకు పరిచయం చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ కాజల్ అగర్వాల్, ఇలియానా మరియు తమన్నాలు ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ప్రియా ఆనంద్ కూడా చేరారు.

గతంలో హీరో నెం.1 మరియు కూలీ నెం.1 చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ వసు భగ్నాని ప్రొడక్షన్ సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ప్రియా ఆనంద్ అంగీకారం తెలిపారు. వసు భగ్నాని కుమారుడు జాకీ భగ్నాని హీరోగా పరిచయం కానున్న “రంగ్ రేజ్” చిత్రం ద్వారా ప్రియా ఆనంద్ బాలీవుడ్లో అడుగు పెట్టనున్నారు. యంగ్ హీరో రానా నటించిన ‘లీడర్’ చిత్రం ద్వారా ప్రియా ఆనంద్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు, ఆ తర్వాత ‘180’ మరియు ‘రామరామ కృష్ణ కృష్ణ’ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

Exit mobile version