విడుదలకు సిద్ధమవుతున్న కళ్యాణ్ రామ్ 3డి సినిమా


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 3డి సినిమా ‘ఓం’ విడుదలకు సిద్ధమవుతుంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో సరి కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ లుక్ బయటకి రాకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కృతి ఖర్భంద మరియు నికిషా పటేల్ నటిస్తున్నారు. ఓం సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. గతంలో చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారుతున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కాం తరపున ఆయనకీ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Exit mobile version