‘ఈగ’ మూవీ టికెట్లకు భారీ క్రేజ్


టాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాల అగ్ర దర్శకుడు ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గ్రాఫికల్ మానియా మూవీ “ఈగ”. ఈ చిత్ర టికెట్లు కనీ వినీ ఎరుగని రీతిలో అమ్ముడుపోతున్నాయి. ఈ రోజు ఉదయమే మల్టీప్లెక్సుల్లో టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు, మొదలు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ప్రసాద్ మల్టీప్లెక్సులో అన్ని షోల టికెట్లు అయిపోయాయి. ఇప్పటి వరకు ఇంతటి క్రేజ్ ఒక్క టాలీవుడ్ అగ్ర హీరోలకు మాత్రమే ఉండేది అలాంటిది స్టార్ హీరో అంటూలేని ఈ చిత్రానికి ఒక్క రాజమౌళి మార్క్ తోనే ఇంత క్రేజ్ రావడం అనేది చెప్పుకోదగ్గ అంశం.

ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్ర వారమే భారీ ఎత్తున విడుదలవబోతున్న ‘ఈగ’ చిత్రం మీద చిత్ర రంగంలో మంచి టాక్ ఉంది. ఈ చిత్రాన్ని సరికొత్త కథాంశంతో మరియు ఈ చిత్రం యొక్క స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ మరియు విజువల్స్ ను ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని రీతిలో అత్యాధునిక సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. ‘ఈగ’ చిత్రం ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంటుంది.

ఇంత క్రేజ్ ఉన్న ‘ఈగ’ చిత్ర టికెట్లు దక్కించుకోవడం ఎంతో కష్టమైన పని. దీనికి పరష్కారం ఏంటో తెలుసా? మేము నిర్వహిస్తున్న ‘ఈగ’ కాంటెస్ట్ లో పాల్గొని ‘ఈగ’ మూవీ టికెట్లను ఉచితంగా గెలుచుకోండి.

‘ఈగ’ కాంటెస్ట్ లో పాల్గొనడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి — ‘ఈగ’ కాంటెస్ట్

Exit mobile version