ఎయిర్ పోర్టులో రొమాన్స్ చేస్తున్న రవితేజ – కాజల్


మాస్ మహారాజ రవితేజ మరియు కాజల్ జంటగా నటిస్తున్న ‘సారోస్తారా’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఎయిర్ పోర్ట్ సెట్లో రవితేజ, కాజల్ పై ఈ చిత్రానికి సంభందించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మిరపకాయ్ తరువాత రవితేజ సరసన రిచా గంగోపాధ్యాయ ఈ సినిమాలో సెకండ్ హీరొయిన్ గా నటిస్తుంది. ఆమె త్వరలో షూటింగ్లో పాల్గోనననుంది. త్వరలో ఊటీలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఊటీలో త్వరలో ప్రారంభం కానున్న మాన్సూన్ సీజన్లో షూటింగ్ చేయబోతున్నారు. ఆంజనేయులు చిత్రం తరువాత దర్శకుడు పరుశురాం మరియు రవితేజ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

Exit mobile version