రజనికాంత్ రాబోతున్న చిత్రం “కోచాడియన్” తెలుగులో ఈ చిత్రం “విక్రం సింఘ” గా రాబోతుంది. ఈ చిత్రానికి ప్రచారం విభిన్న పద్దతిలో చెయ్యనున్నారు. సౌందర్య రజిని కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ మరియు మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు కార్బన్ కంపెనీ వారితో కలిసి ప్రచారం చెయ్యనున్నారు. దీనికి నాందిగా ఈ చిత్ర విడుదల తరువాత ఈ కంపెని వారు ఐదు లక్షల ఫోన్లను విడుదల చెయ్యనున్నారు. ఈ ఫోన్లలో ఈ చిత్రానికి సంబందించిన సన్నివేశాలతో పాటు ఈ చిత్ర పాటలు,ట్రైలర్స్ మరియు పలు చిత్రాలలో రజని కాంత్ చెప్పిన పంచ్ డైలాగ్‌లే కాకుండా ఫోన్ వెనకాల రజని కాంత్ డిజిటల్ సంతకం కూడా ఉండబోతుంది ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ చివరిలో కాని అక్టోబర్ మొదట్లో కాని విడుదల అవుతుంది. “కోచాడియన్” చిత్రంలో రజనీకాంత్ మరియు దీపిక పదుకొనే లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.