యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరక్కుతున్న భక్తిరస చిత్రం “షిరిడి సాయి”. ఈ చిత్రంలో శ్రీ కాంత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం చాలా బాగా తెరకెక్కుతోందని ఆయన అన్నారు.
‘ షిరిడి సాయి చిత్రం చాలా బాగా వస్తోంది, ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నానని, నాగార్జున గారు సాయి బాబా పాత్రలో అద్భుతంగా నటించారని మరియు ఈ చిత్రం ఘన విజయాన్ని సాధిస్తుందని’ శ్రీకాంత్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.