పెద్ద హీరో అయితే చాలు కథ అవసరం లేదంటున్న ప్రముఖ హీరోయిన్

చలన చిత్ర పరిశ్రమలో ఎంతో తెలివైన కథానాయికగా పేరు తెచ్చుకున్నారు మన అందాల భామ తాప్సీ. తాప్సీ ఇచ్చే స్టేట్మెంట్స్ మరియు ఇంటర్వ్యూస్ చదివిన వారెవరైనా ఇది నిజం అని ఒప్పుకుంటారు.ఇటీవలే ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారు చేసిన ఇంటర్వ్యూలో మీ సినిమాలకు సంభందించిన కథలు ఎలా ఎంచుకుంటారు? అని అడిగిన ప్రశ్నకు తాప్సీ ఇలా సమాధానం ఇచ్చారు ” పెద్ద హీరో సినిమా అయితే కథ గురించి పెద్దగా పట్టించుకోను. ఒక స్టార్ హీరో పక్కన అవకాశం రావడం అనేది చిన్నవిషయం కాదని అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమా కథ ఎలా ఉంది మరియు అందులో తన పాత్ర ఎలా ఉందా అని ఆరాతీసి వచ్చిన అవకాశాన్ని వదులుకోనని ఆమె అన్నారు”.

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే మంత్రాన్ని బాగా అనుసరిస్తున్న ఈ భామకి ప్రస్తుతం చాలా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం తాప్సీ ‘ గుండెల్లో గోదారి’ మరియు వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘షాడో’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.

Exit mobile version