కొత్త అవతారం లో రాబోతున్న “బొమ్మాలి నిన్ను వదల”

మాలాశ్రీ మరియు సాయి రవి ప్రధాన పాత్రలలో నటించిన కన్నడ చిత్రం “శక్తి”. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాదించింది ఎకువ మోతాదు లో గ్రాఫిక్స్ కలిగి ఉన్న ఈ చిత్రం సెంటిమెంట్ మరియు యాక్షన్ సమపాళ్ళలో కలిగిన చిత్రం అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రాన్ని ఇపుడు తెలుగు లో “బొమ్మాలి – నిన్ను వదల” అనే పేరుతో అనువదిస్తున్నారు ఈ చిత్రం లో షియాజీ షిండే ప్రధాన పాత్రలో నటించడం తెలుగు వారు ఆహ్వానిస్తారని నిర్మాత చెప్పారు. “అరుంధతి” చిత్రం తో బాగా ప్రచారం పొందిన డైలాగ్ ని టైటిల్ గ ఎన్నుకోతం ద్వారా ప్రేక్షకులలో చిత్రం మీద ఆసక్తి వస్తుందని దర్శకుడు చెప్పారు. దర్శకుడు ఈ చిత్రానికి 2009 లో వచ్చిన అరుంధతి చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పారు.

Exit mobile version